ట్రాన్స్ ఫార్మర్ లతోనే కరెంట్ కష్టాలు..

by Sumithra |
ట్రాన్స్ ఫార్మర్ లతోనే కరెంట్ కష్టాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వానకాలంలో రైతులు తొలకరి జల్లుల ఆశలు వదులుకుంటున్నారు. ఇప్పటికే అరుద్ర కార్తే పూర్తయిన వరుణుడి జాడలేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాలో జూన్ 1 నుంచి 24 వరకు 3615.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 109.6 మిల్లి మీటర్ల సాధరణ వర్షం కురిసింది. 7 మండలాల్లో మాత్రమే ఎక్సేస్ గా, 11 మండలాల్లో సాధరణ, 14 మండలాల్లో లోటు వర్షపాతం కురిసింది. జూన్ మాసంలో పంటల సాగు కోసం మే మాసం నుంచి నారు మళ్లు సిద్ధం చేసుకున్నారు రైతులు. ఐతే పంటల సాగుకు జలశయాల్లో సరిపడా నీరు లేకుండా పోయింది. శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు నిండుకున్నాయి. ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ నుంచి రెండు రోజుల క్రితం ఉన్న కొద్దిపాటి నీటిని విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాలో జలాశయాల తర్వాత అధికంగా గోలుసు కట్టు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపైనే ఆధారం. ఇటీవల ఎండలు దంచికోట్టడతంతో వాటిలోనే నీటి జాడలు అడుగంటాయి.

ఇప్పుడు ఇందూర్ జిల్లాలో వ్యవసాయానికి బోరు బావులు దిక్కయ్యాయి. జిల్లాలో ఎక్కువ శాతం అంటే సాగులో కరెంటు ఆధారంగా మారింది. జిల్లాలో 1,83,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన కరెంటు వినియోగం ను నియంత్రించే 41,000 ట్రాన్ప్ ఫార్మర్ లలో 16 కేవి, 25 కేవిలు ఉన్నాయి. రెండు నెలలుగా జిల్లాలో 1048 ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయాయి. మునుపెన్నడు లేని విధంగా విద్యుత్ వినియోగంతో పాటు, చెడగొట్టు వానాల కారణంగా కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో వ్యవసాయానికి 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఎండాకాలం దంచికొట్టిన ఎండల ఎఫెక్టుతో పాటు తొలకరి జల్లులు ఆలస్యం కావడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మే నెలలో, జూన్ చివరి మాసంలోను విద్యుత్ వినియోగం పెరగడం, అకాల వర్షం కారణంగా విద్యుత్ నియంత్రికలు కాలిపోయాయి. గతంలో ఎన్నడు లేనంతగా కరెంటు ట్రాన్స్ ఫార్మర్ లు ఖాళీ పోవడంతో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి.

జిల్లాలో నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్న రైతులు ఖాళీ పోయిన కరెంటు ట్రాన్స్ ఫార్మర్ లను పట్టుకొని రైతులు మరమ్మత్తు కేంద్రాలకు పరిగెత్తుతున్నారు. ప్రతిసారి విద్యుత్ శాఖ వద్ధ ఉన్న ట్రాన్స్ పార్మర్ ల స్టాకుకు 4 శాతం అధనంగా ఉంచుతారు. విద్యుత్ శాఖాధికారులు. కాని ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో విద్యుత్ నియంత్రికలు ఖాళీ కావడంతో మరమ్మత్తులు చేయడానికి ఉన్న 12 ఎస్ పీయం కేంద్రాలు మరమ్మత్తులను తట్టుకోలేకపోతున్నాయి. ఆయా మరమ్మత్తు కేంద్రాలలో కేవలం రోజుకు 4 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే రిపేరు అవుతున్నాయి. జిల్లాలో ఒక్క జూన్ నెలలో 600 వరకు ట్రాన్సఫార్మర్ లు ఖాళీ పోగా వాటిలో 475 మరమ్మత్తులు పూర్తికాగా ఇంకా 175 రిపేరు కేంద్రాలలో ములుగుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఎప్పుడో దశాబ్దం క్రితం కొత్త ట్రాన్స ఫార్మర్లు ఇవ్వగా గత ప్రభుత్వం హయంలో కొన్ని ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఇచ్చారు.

ఇప్పుడు అంతా లోటు ట్రాన్స్ ఫార్మర్లు కారణంగా రైతులకు మరమ్మత్తులకు గురైన చోట వెంటనే ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. దాని కారణంగా వ్యవసాయం కోసం నారుమళ్లు వేసిన చోట కరెంటు లేక అవి ఎండిపోతున్నాయి. దానితో రైతులకు వానాకాలంలో కరెంటు కష్టాలు తప్పడం లేదు. అందుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం, వాటిని సరైన సమయంలో రిప్లేస్ చేయకపోవడంతో బోరు బావుల వద్ధ వ్యవసాయం రైతులకు కష్టాలను తెచ్చిపెడుతుంది.

Next Story