కామారెడ్డి జిల్లాలో కాంట్రాక్టర్ వినూత్న నిరసన.. డీపీవో, డీఎల్‌పీవో‌‌లను పంచాయితీ కార్యాలయంలో బంధించిన వైనం

by Disha Web Desk 1 |
కామారెడ్డి జిల్లాలో కాంట్రాక్టర్ వినూత్న నిరసన.. డీపీవో, డీఎల్‌పీవో‌‌లను పంచాయితీ కార్యాలయంలో బంధించిన వైనం
X

దిశ, బాన్సువాడ: డీపీవో, డీఎల్‌పీవో‌ ఆఫీసు గేట్లకు కాంట్రాక్టర్ తాళం వేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కుతాడి విజయ్ రెండేళ్ల క్రితం పంచాయతీ కాంప్లెక్స్‌ను రూ.10 లక్షలతో నిర్మించాడు. పనులు చేసి రెండేళ్లు గడస్తున్నా.. ఇంకా బిల్లులు రాలేదు. అయితే, మంగళవారం అధికారులు ఆఫీసుకు వచ్చారన్న సమాచారంతో వారిని బయటకు వెళ్లనివ్వకుండా పంచాయతీ గేటుకు విజయ్ తాళాలు వేశాడు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీలో తాను చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు అయినప్పటికీ తనను సర్పంచ్, అప్పటి పంచాయతీ కార్యదర్శి లంచం ఇవ్వలేదనే తన డబ్బులు ఆపేశారంటూ ఆరోపించాడు. తనకు వెంటనే డబ్బులు చెల్లించాలంటూ.. లేదంటే పంచాయతీ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో జిల్లా ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రావు ,డీఎల్‌పీవో నాగరాజు, విజయ్‌ను సముదాయించేందుకు ప్రయత్నిచారు. అయినా అతడు వినకపోవడంతో అధికారులు ఇంకా పంచాయితీ కార్యాలయంలోనే ఉన్నారు.

Next Story

Most Viewed