నూతన జంబీ గద్దె ప్రారంభం

by Sumithra |
నూతన జంబీ గద్దె ప్రారంభం
X

దిశ, ధర్పల్లి: విజయ దశమి సందర్భంగా బుధవారం నూతన జంబీ గద్దెను స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్ రాజ్ ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ జంబీ గద్దెను నిర్మించిన గ్రామ అభివృద్ధి కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో మరెన్నో మంచి కార్యక్రమాలు చెయ్యాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి అతిధిగా జెడ్పిటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారిక హన్మంత్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ మల్లికార్జున్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెలిమెల రంజిత్, దాసరి గంగాధర్, ప్రశాంత్, శిరీష్, రాజేశ్వర్, వెంకటేశ్వర్లు, నల్ల హన్మంత్ రెడ్డి, రాజ్ పాల్, మహిపాల్ యాదవ్, సరేందర్ గౌడ్, గోలేం గంగాదాస్, సుభాష్, ఎస్పీ లింగం, తదితరుల పాల్గొన్నారు.

Advertisement

Next Story