కాంగ్రెస్ పార్టీకి రైతుల గోస తగులుతుంది: ఎంపీ ధర్మపురి అరవింద్

by Mahesh |
కాంగ్రెస్ పార్టీకి రైతుల గోస తగులుతుంది: ఎంపీ ధర్మపురి అరవింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పొలంలో పంటలు కోసిన గంటలోనే వ్యాపారులు గానీ ప్రభుత్వం గానీ కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తెస్తే రాహుల్ గాంధీ నేతృత్వంలోని దరిద్రపుగొట్టు కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాలను అడ్డుకుందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఖుదువాన్పూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిపోయిన పంట పొలాలను నష్టపోయిన రైతులను ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ... 2024 సంవత్సరంలో కూడా రైతులు అకాల వర్షాలకు పంటల కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నారని అదే నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు.

రైతులు పంటలు కోసి 15 రోజులు గడిచిన ఇప్పటికే కొనుగోలు లేవని పగలు పంటలను ఆరబోసుకొని సాయంత్రానికి వడగళ్ల వానతో భయంతో కాలం వెళ్లదీస్తున్నారు అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు అమలు చేసే అధికారం కేంద్రానికి ఉండదని అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని కానీ ఇక్కడి ప్రభుత్వం మార్కెటింగ్ విధానం గాని కొనుగోలు విధానం గాని పట్టించుకోదని కేవలం కమిషన్ల పైనే దృష్టి సారించిందన్నారు. ఆరుగాలం పంట పండించిన రైతులను క్వింటాలుకు ఐదు కిలోల కడ్తా పేరిట బలవంతంగా కోతలు విధిస్తున్నారని కడ్త ఇవ్వకపోతే రైస్ మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదని రైతులు అందుకు ఒప్పుకోవడం లేదని అన్నారు.

రాష్ట్రంలో ఒక్కసారి బిజెపికి అధికారం ఇస్తే కమిషన్లు లేని నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేసి రైతుల కష్టాలను దూరం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు ఒకటైన ధాన్యమును క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించారని ఇప్పటివరకు దానికి అతీగతీ లేదన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఊసే లేదని అన్నారు. జనవరిలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఇప్పటికే పరిహారం అందలేదని ఎంపీ అరవింద్ దుయ్యబట్టారు. దేశంలో రైతుల ప్రయోజనాల కోసం మోడీ పని చేస్తానంటే కాంగ్రెస్ పని చేయనివ్వడం లేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed