కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం…జీవన్ రెడ్డి లక్షా 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయం...

by Kalyani |
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం…జీవన్ రెడ్డి  లక్షా 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయం...
X

దిశ, నిజామాబాద్ సిటీ : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఒక్క లక్ష 30 వేల మెజారిటీ రావడం కూడా ఖాయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సుదర్శన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిలు మాట్లాడారు.

సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సుపరిపాలన, మచ్చలేని జీవన్ రెడ్డి అభ్యర్థి కావడం కాంగ్రెస్ కు ప్లేస్ పాయింట్ అని వీటికి తోడు మా పార్టీ అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. బీఆర్ఎప్‌ ,బీజేపీతో కుమ్మక్కయినా కాంగ్రెస్ లక్షా 50 వేల మెజారిటీతో నిజామాబాద్ లో గెలుస్తుందన్నారు. అలాగే ఎన్నికల్లో మాకు సహకరించిన సిపిఐ, సిపిఐఎం,సిపిఐఎంఎల్ తదితర పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఈ ఎన్నికల్లో అందరూ తామే అభ్యర్థులమని భావించి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీక అని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు చూసినా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజామాబాద్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. వంద శాతం లక్ష పై చిలుకు మెజారిటీతో తాను గెలుస్తా అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జిల్లా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తర భారతంలో బీజేపీ ఉనికి కోల్పోయిందని, రాష్ట్రం లో డబుల్ డిజిట్ ఎలా సాదిస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ లు ఆకుల లలిత, రాజేశ్వర్ రావు, సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed