మాజీ డీసీఓ సింహాచలం పై మంత్రికి ఫిర్యాదు

by Naresh |
మాజీ డీసీఓ సింహాచలం పై మంత్రికి ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ అధికారిగా పని చేసి రెండు రోజుల క్రితం రాష్ట్ర సహకార శాఖ కమిషనరేట్‌కు అటాచ్డ్ చేయబడిన సింహాచలంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో ఆరున్నర సంవత్సరాలుగా పనిచేసిన డీసీఓ సింహాచలం పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చాయి. అప్పటికే పలు సొసైటీలలో జరిగిన అవినీతి అక్రమాలకు డీసీఓ సింహాచలమే కారకుడని ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఇంచార్జ్ మంత్రికి అప్పట్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పటి మంత్రి డీసీఓ సింహాచలం పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మంత్రికి సన్నిహితంగా ఉండడంతో పాటు జిల్లా కలెక్టర్‌ను సైతం మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది రైతు సంఘాల నాయకులు డీసీఓ సింహాచలం పై ఆధారాలతో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మంత్రి తుమ్మల డీసీఓ సింహాచలం పై విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన రోజున డీసీఓ సింహాచలంకు బదిలీ ఆదేశాలు రావడం విశేషం. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కొత్త డీసీఓగా బాధ్యతలు చేపట్టారు. డీసీఓకు మాత్రం అవినీతి ఆరోపణలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అటాచ్ చేయడం గమనార్హం.

డీసీఓ కాలంలో ఆరోపణలు ఎన్నో....

డీసీఓగా సింహచలం పనిచేస్తున్నప్పుడు నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో పోతంగల్, ఎత్తొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బ్రాహ్మణపల్లి, హోన్నాజిపేట్, డిచ్ పల్లితో పాటు సాక్షాత్తు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో బాల్కొండ, తాళ్ల రాంపూర్ , భీంగల్‌తోపాటు మరో రెండు సొసైటీలలో కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో అప్పుడు విచారణలు జరిగిన ఎవ్వరి పై చర్యలు తీసుకోలేదు. తాడి రాంపూర్ సోసైటిలో జరిగిన అవినీతి అక్రమాలతో జిల్లా పరువు బజారున పడింది. అక్కడ బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ నమోదు కాలేదు కానీ రైతుల చెల్లింపుల కోసం కోట్ల విలువైన ఆస్తులను వేలంలో అమ్మి రైతులకు చెల్లించాల్సి వచ్చింది. దానికి తోడు సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలుకు సంబందించి వచ్చిన కమిషన్ చెల్లింపులో జాప్యం పై ఫిర్యాదు ఉన్నాయి. సహకార శాఖ ద్వారా సోసైటిలకు వచ్చిన కమిషన్ వారి ఖాతాల్లో జమ చేయకుండా ఏడాదికిపైగా తన ఖాతాలో ఉంచి వచ్చిన వడ్డీ డబ్బులను జనరల్ అవసరాల కోసం డబ్బులు డ్రా చేసి వాడుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. అంతే కాకుండా సోసైటిలకు మార్క్ ఫెడ్ ద్వారా ఉద్దేర రూపంలో తీసుకున్న ఎరువుల తాలూకు డబ్బులను రైతుల నుంచి వసూలు చేసిన వాటిని తిరిగి మార్క్ ఫెడ్‌కు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కొందరు డైరెక్టర్‌లు ఫిర్యాదు చేసిన వారిని బేఖాతరు చేసినట్లు విమర్శలు ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లాలో తొలి వికెట్ . . .

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత నిజామాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనువెంటనే విచారణ జరగడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. గత ప్రభుత్వం పెద్ధలతో, అధికారులు చెప్పింది చేసిన జిల్లా అధికారికి బదిలీ జరుగడం పై ఉద్యోగ వర్గాలో కొత్త చర్చకు దారితీసింది. అనాడు గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన నిజామాబాద్ జిల్లాలో పని చేసిన తొలిసారి జిల్లా స్థాయి అధికారి బదిలీతో తొలి వికెట్ పడింది. జిల్లా నుంచి డీసీఓ సింహాచలంలో బదిలీ వేటు వేశారు. అయితే ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా అటాచ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో సింహాచలం పై విచారణ పూర్తయ్యేంతవరకు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ సమాచారం ఉంది. ఇప్పటికైనా అవినీతి జిల్లాలో సొసైటీలో జరిగిన అవినీతిలో పందికొక్కులు బహిర్గతం అవుతాయని చర్చ జరుగుతోంది. జిల్లాలో సహకార శాఖలో జిల్లా అధికారిపై వేటు పడగా తరువాత అంతా ఇప్పుడు సీఎంఆర్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖపై అందరి దృష్టి పడింది. ఈ నెలాఖరు వరకు మిల్లర్లు సీఎంఆర్ ను ఎఫ్‌సీఐకి అప్పగింత గడువు ఉండగా ఇప్పటికే విజిలేన్స్, ఇంటలిజేన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవ్వరి పై చర్యలు తీసుకుంటారో అని అధికార వర్గాలో కలవరం మొదలైంది.

Advertisement

Next Story