- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పంచాయతీ ఓటర్ జాబితా పై ఎంపీడీవోలకు కలెక్టర్ శిక్షణ
దిశ, కామారెడ్డి : గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారీపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఈ పంచాయతీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఓటరు జాబితాను రూపొందించడం పై గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు అవగాహన చేసుకోవాలని అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లలో రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా గ్రామపంచాయతీ ఓటర్ లిస్ట్ 2024 తయారు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ టీ పోల్స్ లో గ్రామపంచాయతీ ఓటర్ జాబితా నుండి వార్డుల వారీగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కల వివరాలను అటవీశాఖ వెబ్సైట్ మేరీ లైఫ్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం పై
అధికారులు దృష్టి పెట్టాలని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ప్రతిరోజూ ఎల్ఆర్ఎస్ డిస్పోజల్ పై సమీక్షిస్తున్నారన్నారు. దరఖాస్తులను ఫీల్డ్ విజిట్ చేసి ఇరిగేషన్ భూములు, రోడ్డు మార్కింగ్ లో పోయిన భూములు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భూములు, పట్టా కానీ భూములు తదితర భూములు లేకుండా చూసుకొని ఎలాంటి వివాదం లేని భూముల దరఖాస్తులను జాగ్రత్తగా మండల పంచాయతీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పరిశీలించాలన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూముల దరఖాస్తులను డిస్పోజల్ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి ద్వారా పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీఆర్డిఓ సురేందర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారులు శ్రీనివాస్, సురేందర్, నాగరాజు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.