- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులకిచ్చిన హామీలను సీఎం వెంటనే నెరవేర్చాలి : టీజేఎస్ చీఫ్ కోదండరాం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
దిశ, ఎల్లారెడ్డి : రైతులకిచ్చిన హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా.. నిరుద్యోగులు నేటికీ ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తన కుంటుంబ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ పాకులాడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో తన కూతురు ఓడినంత మాత్రానా.. వెంటనే ఎమ్మెల్సీగా నియమించారని, రాష్ట్రంలో యువత విద్యార్థులు, నిరుద్యోగులు ఎటు పోయిన తనకు పట్టింపు లేదంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తన పాలనతో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండి పడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ప్రకటించిన ఎకరానికి రూ.పది వేలు తక్షణమే చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు పట్టాలందిస్తామని, సర్వేలు నిర్వహించి ఇప్పటికీ పట్టాలివ్వకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ తెలంగాణ జన సమితి ఇన్ చార్జి నాయకులు నిజ్జన రమేష్, కామారెడ్డి జిల్లా పార్టీ నాయకులు లక్ష్మణ్, తెలంగాణ జన సమితి ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు, ఆయా గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.