కులగణనతోనే వర్గీకరణ సాధ్యం

by Sridhar Babu |
కులగణనతోనే వర్గీకరణ సాధ్యం
X

దిశ, నిజామాబాద్ సిటీ : కులగణనతోనే ఎస్సీ వర్గీకరణతో పాటు అన్ని కులాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ సంఘాల రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల జోడో యాత్ర లో భాగంగా గురువారం నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో మాదిగల జోడోయాత్ర సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ కుల గణన చేయకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలు అలాగే ఉండిపోయాయని తెలిపారు. కేవలం కులగణన చేస్తేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలు అల్లర్లను, మతవిద్వేషాలకు తావునీయకుండా బీజేపీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి తీరాలని ఆయన పిలుపునిచ్చారు.

కేవలం మాదిగలకు మాయమాటలు చెప్పి వారి ఓట్ల ద్వారానే ఉత్తర తెలంగాణలో బీజేపీ పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందని ఆరోపించారు. మాదగలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కమిటీలతో కాలయాపన చేస్తుందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో మాదిగల జోడోయాత్ర విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శుక్రవారం పెద్దపల్లి కరీంనగర్లలో మాదిగల జోడో యాత్ర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జే ఏ సీ జిల్లా నాయకులు బరికుంటా శ్రీనివాస్, మాల్యాల గోవర్ధన్,

మల్లని శివ, శివకుమార్, విజయ్ కుమార్, మహేందర్, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుదాల బాబురావు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, ఎం ఆర్ పీ ఎస్ అధ్యక్షులు మైసా ఉపేందర్, మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్యపాగం నరసింహారావు, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రసాద్, మాదిగ యూత్ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నక్క మహేష్, దేవరకొండ నరేష్, గద్దల రమేష్, జోగు గణేష్, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed