- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెన్షన్.. టెన్షన్.. రుద్రూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ
దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం అర్థరాత్రి నుంచి ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని చౌరస్తాలోగల పాషా హోటల్ వద్ద సులేమాన్ ఫారంకు చెందిన వ్యక్తి, రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. హోటల్ పక్కనే ఉన్న చెప్పుల షాపు దుకాణదారుడు సులేమాన్ ఫారం గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ తోపాటు మరికొందరు రుద్రూర్ చేరుకున్నారు. వాదోపవాదనల తర్వాత వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి రెండు వర్గాలను చెదరగొట్టారు. గొడవలో ఓ వర్గానికి చెందిన వ్యక్తికి, తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన బోధన్ లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ నాగరాజు సంఘటన స్థలానికి వెళ్ళారు. ఇరు వర్గాలను సముదాయించారు. మళ్ళీ గొడవలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ ఏం జరుగుతుందోననే భయంతో, గ్రామంలో టెన్షన్ టెన్షన్ పరిస్థితులే నెలకొన్నాయి.