- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర...
దిశ, ఆర్మూర్ : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. శనివారం ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా కూడలిలో రైతు సంఘం కేవీపీఎస్ , ఎస్ఎఫ్ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కోతల విధించడం దుర్మార్గం అని అన్నారు. 2023-24లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి రూ.1,15,531.79 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయానికి రూ.71,378 కోట్లు మాత్రమే కేటాయించి మిగిలిన నిధులు పథకాలకు కేటాయించి పథకాల పేర్లు మార్చిందన్నారు.
వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్లో 3.2 శాతం మాత్రమే కేటాయింపులు చూపారని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పటికీ కేంద్రం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. వరి, పత్తి, సోయా, పప్పులు, వేరుశనగ లాంటి పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో 2023-24 సంవత్సరానికి పంట రుణాల కింద 18 లక్షల కోట్లు రుణాలు ఇస్తామని ప్రకటించారని, గతంలో 16 లక్షలు ప్రకటించిన ఆర్థికమంత్రి ప్రకటన పత్రికలకే పరిమితం అయిందన్నారు.
రుణమాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని, మార్కెట్లలో కనీస మద్దతు ధరలు అమలు జరగక, ఏటా రైతులు వేల కోట్లలో నష్టపోతున్నారాన్నరు. ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దివాళా తీయిస్తున్నాయి. బడ్జెట్లో మార్కెట్ జోక్యం పథకం కింద 500 కోట్లు మాత్రమే కేటాయించారు. కనీసం రైతులు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అనుగుణంగా నిధులు కేటాయించినప్పటికీ తిరిగి అమ్మిన తరువాత ప్రభుత్వానికి వ్యయం చేసిన నిధులు వస్తాయి. రైతులకు ప్రయోజనం ఉంటుంది.
ఉపాధి హామీ పథకానికి 2.25 లక్షల కోట్లు కేటాయించమని డిమాండ్ చేస్తుండగా క్రమంగా తగ్గిస్తూ పోతున్నారు .ప్రజలకు సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యానికి కోతలు విధించారు.ఈ పరిస్థితులను గమనించి వ్యవసాయం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ ను పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు.లేని యెడల దేశశ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజావ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా జాతీయ కమిటీల గెలుపులో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ ఆర్మూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ రాజు, భామండ్ల రవి, రాము, బాలే రావు తదితరులు పాల్గొన్నారు.