కామారెడ్డి లో వెంకటరమణారెడ్డి గెలుపు పట్ల సంబరాలు

by Sridhar Babu |
కామారెడ్డి లో వెంకటరమణారెడ్డి గెలుపు పట్ల సంబరాలు
X

దిశ, భిక్కనూరు : సీఎం కేసీఆర్ పై కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందడం పట్ల ఆ పార్టీ శ్రేణులు మండల కేంద్రమైన భిక్కనూరుతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల్లో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని సినిమా టాకీస్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఒకరికి ఒకరు సీట్లు తినిపించుకున్నారు. అనంతరం గాంధీ చౌక్ మీదుగా ప్రధాన రహదారుల్లో విజయోత్సవ ర్యాలీ తీసి రమణారెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా టపాకాయలు కాలుస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించి రమణారెడ్డి గెలుపొందడం పట్ల బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా విజయోత్సవాలు జరుపుకున్నారు.

Next Story

Most Viewed