- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Retail Inflation: తొమ్మిది నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఊహించిన విధంగానే పెరిగింది. కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి 5.49 శాతానికి చేరింది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం కంటే ఎగువన నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటనలో తెలిపింది. గత రెండు నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యం పరిధి(2-6 శాతం)లోనే ఉంది. జూలై తర్వాత ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎక్కువ నమోదవడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.66 శాతం నుంచి 9.24 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 4.16 శాతం నుంచి 5.87 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 3.14 శాతం నుంచి 5.05 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం అత్యధికంగా 10.71 శాతం నుంచి 35.99 శాతానికి పెరగడం గమనార్హం. కాగా, ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణంపై మరింత స్పష్టత వచ్చేందుకు పాలసీ వైఖరిని తటస్థ స్థితిని మార్చిన సంగతి తెలిసిందే.