మారుమూల మండలాల అభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ నగేష్

by Aamani |
మారుమూల మండలాల అభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ నగేష్
X

దిశ,బెజ్జూర్ : ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, బెజ్జూర్ మండలాల్లో సిరిపుర్ ఎమ్మెల్యే పాల్వ హరీష్ బాబు తో కలిసి ఆయన పర్యటించారు. దహేగాం ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని, ఎంపీ గొడం నగేష్ మాట్లాడారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ ఆడిటోరియమ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విలువలతో కూడిన జర్నలిజం ను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలని పాత్రికేయులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిపుర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గం లో స్వేచ్ఛ వాతావరణంలో వార్తలు రాసే పత్రిక విలేకరులకు అవకాశం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారాస రాష్ట్ర నాయకులు ఆర్ఎస్పీ, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కాగజ్ నగర్ సీనియర్ రిపోర్టర్ సురేందర్ రావు, నియోజకవర్గం లోని రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story