హుమ్నాపూర్ లో దంపతుల కుల బహిష్కరణ..

by Sumithra |
హుమ్నాపూర్ లో దంపతుల కుల బహిష్కరణ..
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందిన దంపతులను కుల బహిష్కరణ చేశారు. తమకు సొంత తమ్ముడు అన్యాయం చేశాడని, మీరైనా న్యాయం చేయాలని వెళితే పంచాయతీ పేరుతో 5000 రూపాయలు తీసుకొని దాడులు చేసి, కుల బహిష్కరణ చేశారన్నారు. వీఆర్ఏ, వర్ని మండల అధ్యక్షులు గైని ఈశ్వర్ తమపై రౌడిజం, గుండాయిజం చూపిస్తున్నాడని, తమ పేరుపై ఉన్న భూములను అక్రమంగా చీటింగ్ చేసి ఫోర్జరీ సంతకలతో పట్టాలు చేసుకుని అన్యాయం చేశాడన్నారు. న్యాయం జరిగేంతవరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని అన్నారు. ఇటీవల వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు అయ్యాయని తెలిపారు.

ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు గైని సాయిలు, రేఖలు శనివారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రాన్ని ఆర్డిఓకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ లో వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి జిల్లా చెందిన వారమంటూ, పొట్టకూటికోసం హైదరాబాద్ పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి, కూలి పని చేసుకొని బతుకుతెరువు కొనసాగించుకుంటున్నామని తెలిపారు. తమ పేరుపై ఉన్న 18 గంటల భూమిని, తమ ప్రమేయం లేకుండా తమకు చెప్పకుండా ఫోర్జరీ సంతకలతో గైని ఈశ్వర్ తమ భూమిని ఇతరులకు అమ్మి వేశాడని పేర్కొన్నారు. అంతేగాకుండా సుమారు తమ పూర్వికుల నుంచి వచ్చే ఐదు ఎకరాల భూమిని సైతం తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకలతో విక్రయించుకొని తమను మోసం చేశాడని అన్నారు.

అంతేగాకుండా తమకు దక్కాల్సిన విఆర్ఏ పోస్టులు సైతం అక్రమంగా తమను మోసం చేసి ,తానే ఉద్యోగం చేస్తున్నాడని పేర్కొన్నారు. గైని ఈశ్వర్ తో పాటు కులం పెద్దమనుషులు తమకు న్యాయం చేస్తామంటూ, గత రెండు రోజుల క్రితం గ్రామంలోని ఎస్సీ కమిటీ హాల్ లో పిలిపించి, పంచాయతీ పేరుతో 5000 రూపాయలు తీసుకున్నారన్నారు. తమకు న్యాయం చేయకపోగా తమపై దాడులకు యత్నం చేసి కుల బహిష్కరణ చేశారని వాపోయారు. గ్రామపెద్దలు రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ పెద్దలు, రుద్రూర్, కోటగిరి గ్రామ పెద్దలు తమల్ని కాపాడడం జరిగిందని, వారు లేకపోతే చంపేస్తుండేనని, తమ గోడును మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికైనా బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్ తమకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed