ఐదు నెలలు గడిచినా కొలిక్కిరాని కేసు..

by Sumithra |
ఐదు నెలలు గడిచినా కొలిక్కిరాని కేసు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్, హైదరాబాద్ రహదారి పై ఉన్న టీమార్ట్ దహనం (దగ్ధం) కేసు ఐదునెలలు గడిచినా కొలిక్కి రాలేదు. కోట్ల రూపాయల ఆస్తులు ఏకంగా భవనం కూల్చాల్సిన అవసరం పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టీ మార్ట్ వ్యాపార భాగస్వామ్యుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో గతేడాది ఆగస్టు మాసంలో టీ మార్ట్ ను మూసివేశారు. టీ మార్ట్ దందాలో వచ్చిన ఆదాయ, వ్యాయాల పంపకాల నేపథ్యంలో సుపారీ ఇచ్చి అక్కడ షెటర్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అప్పట్లో ఈ వ్యవహరం చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్, మరో వ్యక్తి కలిసి ఆందోళన చేసేవారికి మద్దతు తెలుపడంతో పోలీసులు కేసునమోదు చేయడంలో తాత్సారం చేశారు.

ఇదే అదునుగా ఆగస్టు 28న అర్ధరాత్రి టీ మార్ట్ అగ్నికి ఆహుతి అయ్యింది. టీ మార్ట్ వెనుక భాగం నుంచి అంటిన మంటలు రహదారి వైపు ఉన్న షటర్ల వరకు విస్తరించి మార్ట్ మొత్తం కాలిబూడిదైంది. ఈ వ్యవహరంలో అప్పుడు సంబంధిత వ్యాపార భాగస్వాములో ఒకరు మిగిలిన భాగస్వాములపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసునమోదు చేశారు. తర్వాత అందులో దహనం పై అనుమానంతో కొందరినీ కస్టడికి తీసుకుని విచారించిన తర్వాత కేసు విచారణ అటకెక్కింది. నగరంలోని మహాలక్ష్మీనగర్ లో టీ మార్ట్ దహనం వ్యవహరం పలుఅనుమానాలను రెకెత్తిస్తుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్నసీసీటీవీతో పాటు పుటేజీలు కాలిబూడిదయ్యాయి.

ఆ రోజు రాత్రి టీ మార్ట్ వెనుక భాగంలో రెండు బుల్లెట్ బైక్ లకు సంబంధించిన విజువల్స్ మాత్రమే దొరికాయి. అయితే అగ్నిప్రమాదంపై సంబంధిత ప్రభుత్వ శాఖలు అవి ప్రమాదవశాత్తు జరిగింది కాదని నిర్ధారించడం విశేషం. అగ్నిమాపక శాఖ ప్రమాదవశాత్తు జరుగలేదని సర్టిఫై చేసింది. విద్యుత్ శాఖ సైతం షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించలేదని నిర్ధారించింది. రెండు ప్రభుత్వ శాఖలు టీ మార్ట్ దగ్ధం ప్రమాదవశాత్తు జరుగలేదని రూడి చేయడంతో అసలు ఏం జరిగిందనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసు శాఖపై పడింది. టీ మార్ట్ లో ఉన్న వ్యాపార విభేదాల కారణంగానే దానిని దహనం చేశారా ? లేక ఇన్సూరెన్స్ కోసం దహనం చేశారా ? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అక్కడ సంబంధిత వ్యాపార భాగస్వాములు భీమా చేయలేదని సమాచారం. కానీ కోట్ల రూపాయల సామాగ్రితో పాటు బిల్డింగ్ మాత్రం దహనం దగ్ధం పై అనుమానాలు మాత్రం నివృత్తి కాలేదు.

టీ మార్ట్ వ్యవహరంలో విచారణకు అధికార పార్టీ నేత ఒకరు అడ్డుపుల్ల వేసారన్నది చర్చజరుగుతుంది. వ్యాపార భాగస్వాములు కొందరు అధికార పార్టీ నేత అనుచరుడు కావడమే కారణమని వాదనలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు కేసునమోదు చేసినా తర్వాత విచారణను అటకెక్కించడానికి అదే కారణమనే వాదనలు ఉన్నాయి. ప్రజల ఆస్తులు కాలిబూడిది అయితే దాని వెనుక రాజకీయం ఏందనే చర్చ జరుగుతుంది. బాధితులు ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనమే లేకుండాపోయిందని వాపోతున్నారు. వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలను రాజకీయంగా వాడుకుని సొమ్ముచేసుకోవడం ఏమిటని చర్చ మొదలయింది.

ఐదు నెలల క్రితం కోట్ల రూపాయల విలువైన మార్ట్ కాలి బూడిది అయితే అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాల్సి ఉండగా తాత్సారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులకు వ్యాపార భాగస్వాములు పై నుంచి ఒత్తిడి తెచ్చి అమ్యామ్యాలు సమర్పించడంతోనే కేసును సీరియస్ గా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయల విలువైన వస్తు సామాగ్రి, అంతే స్థాయిలో విలువైన భవనం అగ్నికి ఆహుతి చేసిన సుపారీ తీసుకుని దహనం చేసిన గ్యాంగ్ లో కొందరినీ మొదట గుర్తించినా తర్వాత వదిలివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు వివాదం కొలిక్కి రాకముందే టీ మార్ట్ భాగస్వాములలో ఒకరి షాప్ ను గాంధీ గంజ్ ప్రాంతంలో దహనం చేసే కుట్ర జరిగినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed