- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: హరీష్.. నీ రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో: నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నిప్పు రాజేసింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆగస్టు 15లోపు కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన సవాల్ విసిరారు. అందుకు కౌంటర్‌గా నిన్న వరంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఆగస్టు 15లోపు కచ్చితంగా రుణ మాఫీ చేసి తీరుతామని, హరీష్‌రావు రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని ఉండాలని అన్నారు. అయితే, ఇవాళ అదే అంశంపై నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, హరీష్ రావుపై ఓ రేంజ్‌లో సెటర్లు వేశారు. ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేసుడు ఖాయమని, ‘హరీష్.. నీ రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో అంటూ’ ఎద్దేవా చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కేవలం అదానీ, అంబానీలకు మాత్రమే రూ.లక్ష కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయని బీజేపీ తెలంగాణ రైతాంగం ఎందుకు ఓటు వేయాలంటూ ఆయన ప్రశ్నించారు. రైతుల మంచి, చెడులు చూసే పార్టీలకే ఓటు వేయాలంటూ జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.