BREAKING: కామారెడ్డి జిల్లాలో వివాదాస్పదంగా డీసీసీబీ అధికారుల తీరు.. రైతుల పొలాల్లోకి వెళ్లి ఆ పని

by Shiva |
BREAKING: కామారెడ్డి జిల్లాలో వివాదాస్పదంగా డీసీసీబీ అధికారుల తీరు.. రైతుల పొలాల్లోకి వెళ్లి ఆ పని
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు మామూలుగా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్‌‌కు అంటిస్తారు. లేదా నేరుగా లోన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వాకబు చేస్తారు. కానీ, కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పట్ల బ్యాంకు అధికారుల తీరు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా పంట సాగుకు కోసం డిస్ట్రిక్ కొ-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) నుంచి పలువురు రైతులు గతేడాది రుణాలు తీసుకున్నారు. లోన్ అమౌంట్ తిరిగి చెల్లించేందుకు గడువు ముగిసినా.. ఎవరూ డబ్బు కట్టపోవడంతో డీసీసీబీ అధికారులు వినూత్న రీతిలో రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. లింగంపల్లి మండలం, పొల్కంపేట్ గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపు రంగు జెండాలను నాటారు. తీసుకున్న లోన్ అమౌంట్ వెంటనే చెల్లించాలని.. లేని పక్షంలో భూములను వేళం వేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. మీరు అధికారులా లేక గూండాలా..? పొలాల్లోకి వచ్చి జెండాలు పెట్టడం ఏంటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed