Tollywood: టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా.. దీనిలో నిజమెంత?

by Prasanna |
Tollywood: టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా.. దీనిలో నిజమెంత?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా..? అసలు వైజాగ్‌ తెలుగు సినీ పరిశ్రమకు కలిసొస్తుందా.. ఏపీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేయండంటూ పిలుస్తోందట.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈమధ్య టాలీవుడ్‌ లో రోజుకొక వార్త బయటకొస్తుంది. రేవ్‌ పార్టీలు, డ్రగ్స్‌, పర్సనల్‌ లైఫ్ ఇలా ఎన్నో రకాల న్యూస్ లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా, ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో టాలీవుడ్‌ మొత్తం ఉలిక్కి పడింది. టాలీవుడ్‌లోనే అక్కినేని నాగేశ్వరావుది పెద్ద కుటుంబం .. నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత.. ఇలా అందరూ సినీ ఫీల్డ్ లో ఉన్న నటులు. ఈ వార్త టాలీవుడ్ నే కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్‌ చేసింది. మెగాస్టార్‌ నుంచి సూపర్‌ వరకు అందరూ రియాక్ట్‌ అయ్యారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ కూడా నటుడు కావడంతో వీరికి రెక్కలొచ్చాయి. దీంతో టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అయిపోతుందన్న కామెంట్స్‌ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్థలాలు కేటాయిస్తే వైజాగ్‌లో స్టూడియోలు కట్టుకుంటామంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్‌ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed