ఆర్మూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

by Sridhar Babu |   ( Updated:2023-10-19 14:23:43.0  )
ఆర్మూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
X

దిశ, ఆర్మూర్ : అచ్చమైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే మన ఆడపడుచుల వేడుకైన బతుకమ్మ పండుగ సంబురాలు గురువారం అర్మూర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ పంథా సంఘంలో, పెర్కిట్ గురడి రెడ్డి సంఘంలో, 8వ వార్డు కౌన్సిలర్ సంగీత రవిగౌడ్ నివాసంలో, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ స్వాతిసింగ్ సంజయ్ సింగ్ నివాసంలో, ఆర్య వైశ్య సంఘంలో, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్

వినిత పవన్ నివాసంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడిపాడారు. సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ పండుగ జరిపారు. కాగా ఎమ్మెల్సీ కవిత బాలాజీ జెండా ఆలయం నుంచి ర్యాలీ గా వేలాది మంది మహిళలతో జాంబీ హనుమాన్ ఆలయం వరకు చేరుకొని బతుకమ్మ సంబురాలలో పాల్గొన్నారు. మధ్యలో శ్రీరామ కాలనీ దేవి మండపం దగ్గర జరిగిన చంఢీ హోమం లోనూ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Next Story