- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సారూ.. ఎన్నారై పాలసీ ఇవ్వండి
దిశ, కామారెడ్డి రూరల్ : గల్ఫ్ బాధితుల కోసం సీఎం కెసీఆర్ ప్రకటించిన ఎన్నారై పాలసీ ఇవ్వాలని గల్ఫ్ కార్మికుల అవగాహన సంస్థ బహ్రెయిన్ శాఖ జనరల్ సెక్రటరీ బండ సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ బాధితుల సంక్షేమ సంఘం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో మంది అమర వీరులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారన్నారు. అందువల్లనే నేడు మనకంటూ ఒక రాష్ట్రం ఏర్పాటయిందన్నారు.
ఆ రాష్ట్రానికి ఒక మంత్రి వర్గం, పరిపాలన అనేది ఏర్పడిందని, అయినా కూడా నేటికి కొంత మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారన్నారు. పరాయి దేశంలో మన దేశ పౌరులు ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. వలస వెళ్లి తిండి లేక, ఉందామంటే సదుపాయాలు లేక, తిరిగి వద్దామంటే చేతిలో డబ్బులు లేక, చాలి చాలని బ్రతుకులతో తమ జీవితాన్ని గడుపుతున్నారన్నారు.
ఎన్ని బాధలు ఉన్నా ఏదో ఒక రోజు తాము కలలు కన్న రాష్ట్రం తమను ఆదుకోదా అనే ధీమాతో ఉన్నారని తెలిపారు. వారు పెట్టుకున్న ఆశలను సీఎం కేసీఆర్ పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా సీఎం గారు.. మీ ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు మా గల్ఫ్ అన్నలకు చేసిన వాగ్ధానాలు మరిచి పోయారా..? అని ప్రశ్నించారు. గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం మీరు ఇస్తానన్న 500 కోట్ల రూపాయలు ఎటు పోయాయని నిలదీశారు.
తాము కలలు కన్న సొంత రాష్ర్టంలో తమకంటూ ఒక గుర్తింపు లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇంకెన్ని రోజులు, మా బాధలు మీకు అర్థం కావడం లేదా.. ఏ విషయాన్ని అయినా తెగే దాకా లాగద్దు అని అన్నారు. ఇకనైనా ఆలోచించండి సీఎం .. మేము కూడా మీ ప్రభుత్వాల్లో, మీ పరిపాలనలో ఒకరిమేనని గుర్తుంచుకోవాలని కోరారు. వెంటనే ఎన్నారై పాలసీ అమలు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరారు.