ఎమ్మెల్సీ కవితకు ఒక న్యాయం.. మైనార్టీలకు ఒక న్యాయమా ?

by Sumithra |
ఎమ్మెల్సీ కవితకు ఒక న్యాయం.. మైనార్టీలకు ఒక న్యాయమా ?
X

దిశ, పిట్లం : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఇప్పటి వరకు అరెస్టు చేయని పోలీసులు మెదక్ జిల్లాలో మైనార్టీ యువకుడు గొలుసు దొంగతనం చేసిన ఖదీర్ ఖాన్ ను పట్టుకొని చిత్రహింసలు చేసి అతని ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం బహుజన రాజ్యాధికార యాత్రలో పిట్లం మండలములోని గోద్మేగాం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్లి చూసినా పరిస్థితి అద్వాన్నంగా తయారైందని, డబుల్ బెడ్ రూమ్ లో జాడ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాన్సువాడ నియోజకవర్గంలో ఎటు చూసినా డబుల్ బెడ్రూంలో కనిపిస్తున్నాయి. సిద్దిపేట్ సిరిసిల్ల నియోజకవర్గం ఫుల్ గా ఉన్నాయి. కానీ వెనుకబడిన ప్రాంతమైన అంటున్న జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా కనిపించకపోవడం సూచనయంగా ఉందని అన్నారు. జుక్కల్ ప్రాంత ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ దళితులుగా ఎమ్మెల్యేలుగా గెలిచి దళితుల కాలనీలో కూడా ఇప్పటివరకు చూపించని ముఖమని ఆయన అన్నారు. మైనార్టీ యువకుడు గాంధీ ఆస్పత్రిలో మరణించగా అతని ప్రాణాలు ఎవరు తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. బులుసు దొంగతనం చేస్తే ఇంత శిక్షగా వివరించిన పోలీసులు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ఉండి 100 కోట్లకు పైగా ఈడీ కేసునమోదు చేసిన ఇప్పటివరకు ఆమెకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కుటుంబ పాలన వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. భోజన పార్టీ అధికారంలోకొస్తే బహుజనుల రాత మారుస్తానని అన్నారు. పిట్లం మనలోని తిమ్మానగర్, మార్దండ, కంబాపూర్, గోద్మేగాం, కారేగాం గ్రామాలలో వీధివీధినా పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీఎస్పీ కన్వీనర్ గుల్లని సాయిలు, వీఆర్వో ఉపేంద్ర, సాయిలు, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, పార్టీ కార్యకర్తలు దళితులు బహుజనులు పాల్గొన్నారు.

Advertisement

Next Story