- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమాచార హక్కు చట్టం... వజ్రాయుధం రామబాణం..
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతిగృహంలో విద్యార్థినులకు సమాచార హక్కు చట్టం పై న్యాయవాది గటడి ఆనంద్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో తమకు కావాల్సిన సమాచారం ఎలా రాబట్టుకోవాలో క్లుప్తంగా వివరించారు. ఈ చట్టం పై సాధించిన విజయాలు సూచించారు.
దేశవ్యాప్తంగా పట్టిపీడిస్తున్న అవినీతిని అంతం చేసేందుకు సమాచార హక్కు చట్టం ఆయుధం లాంటిదని, అవినీతిని బయట పెట్టేందుకు ఈ చట్టం క్రింద పూర్తి వివరాలు కోరుతూ ఆయా శాఖలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భాల్లో 48 గంటలు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన దరఖాస్తుదారునికి తప్పుడు సమాచారం ఇచ్చిన, అసంపూర్తి సమాచారం ఇచ్చిన వారికి రాష్ట్రకమిషన్ కు రోజుకు 250 నుండి 25 వేల వరకు జరిమానా విధించే అధికారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ జైశీల, న్యాయవాది గటడి ఆనంద్, విద్యార్థినులు పాల్గొన్నారు.