ఆటిజం చిన్నారుల వైద్యశాల సీజ్

by Sridhar Babu |
ఆటిజం చిన్నారుల వైద్యశాల సీజ్
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బ్రైట్ ఆటిజం, చైల్డ్ కేర్ సెంటర్ ను జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ అంజన ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టి ఎలాంటి అనుమతులు, ధ్రువీకరణ పత్రాలు లేకుండా సెంటర్ ను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

చిన్నారులకు బుద్ధి మాంద్యం తక్కువగా ఉండి మానసికంగా అభివృద్ధి చెందని పిల్లలకు ప్రత్యేక థెరపీ ఉపయోగిస్తూ వివిధ రకాలైన చికిత్సలు అందిస్తారు. ఈ సెంటర్లో స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ చేస్తారు. తాము సీజ్ చేసిన ఈ సెంటర్​లో ఐదుగురు యువకులు కలిసి ఎటువంటి విద్యార్హతలు లేకుండా నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు. అందుకే ఈ సెంటర్ లో తనిఖీలు చేపట్టి సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed