- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
దిశ, కామారెడ్డి : ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 15 ఆగస్ట్ కార్యక్రమాలను ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ జీవితాలను అంకితం చేసిన మహానుభావుల స్ఫూర్తితో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథి, వీఐపీలు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జిల్లా ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్ ముస్తాబు, సెక్యూరిటీ, స్టేజీ, సౌండ్ సిస్టం, సీటింగ్, షామియానా, తాగునీరు, సంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల శకటాలు, అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ముఖ్య అతిథి ప్రసంగం కాపీ తయారీ, కలెక్టరేట్ ను విద్యుత్ బల్బులతో డెకరేషన్ పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, సీపీఓ రాజారామ్, కలెక్టరేట్ ఏఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.