- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Armor MLA : ప్రోటోకాల్ పాటించేలా చర్యలు చేపట్టండి...
దిశ, ఆర్మూర్ : ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు ఏ విధమైన ప్రోటోకాల్ ను అధికారులు ఇవ్వడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ హాల్లో స్పీకర్ ఛాంబర్ లో ప్రసాద్ లతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేరువేరుగా మాట్లాడారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన స్థలాల్లో అనధికారిక ఎమ్మెల్యేలుగా ఉండాలని మీరే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావాలని చెప్పిన మాటలను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. మీరు చేసినట్టు ఆర్మూర్లో ఓడిన నాయకులే చేస్తున్నారని మరి గెలిచిన నేనేం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పినట్లు రాకేష్ రెడ్డి చెప్పారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో అధికారులను 15 లక్షలు తీసుకుంటూ పెట్టించడం భావ్యం కాదని, తనకు అలాంటి డబ్బులు ఇచ్చే వచ్చి డ్యూటీలో నిర్వహించే అధికారులు అవసరం లేదని, నీటితో నిజాయితీగా పనిచేసే అధికారులను ఆర్మూర్ ఇవ్వాలని ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గం గతంలో మాట ఇచ్చిన ప్రకారం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ఇవ్వాలని మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి ఆర్మూర్ ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీనికి వారు ఆర్మూర్ ప్రాంతానికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ఇస్తామని మరొకసారి మాటిచ్చారని త్వరలోనే వస్తుందని రాకేష్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా, స్పెషల్ కోటా కింద నిధులు కేటాయించాలని, స్థలాలు లేనివారికి ఇండ్లను, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణాన్ని కోసం నిధులను కేటాయించాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 10 సంవత్సరాలుగా ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు కట్టించిన పాపాన నాయకులు పోలేదన్నారు. తప్పకుండా ఈసారి ఆర్మూర్ నియోజకవర్గంలో నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించేలా నిధులు కేటాయించాలన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఇండ్లతోపాటు రేషన్ కార్డులను, పింఛన్లను మంజూరు చేయించాలన్నారు. ఆర్మూర్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ప్రజలు అనునిత్యం పనులు చక్కబెట్టుకునేందుకు రోడ్డు సౌకర్యం చాలా అవసరమని రోడ్ల మరమ్మత్తుల కోసం ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా చెడిపోయిన రోడ్లన్నిటికీ నిధులను కేటాయించాలన్నారు. వీటితో పాటు ఆర్మూర్ లోని లక్కంపల్లి సెజ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సాహకాలు అందించాలని, పరిశ్రమల ఏర్పాటుతో ఆర్మూర్ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ లకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వివరించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాదులు సానుకూలంగా స్పందించి ఆర్మూర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, ఆర్మూర్లో అధికారులు ప్రోటోకాల్ పాటించేలా చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్లో తొందరలోనే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను మాక్లూర్, ఆలూర్ మండలాల నడి మధ్యలో ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు.