- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్ వెజ్ శివ..మాంసంతో ఉపవాస దీక్ష విరమణ..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శివునికి భక్త వల్లభుడు, బోళా శంకరుడు అని పేరు. ఏ పేరున పిలిచినా ముందువరుసలో ఉంటాడు అంటాయి పురాణాలు, ఇతిహసాలు. శివుడు అభిషేక ప్రీయుడు అని నానుడి. అంతే కాదు భక్తులు ఎమిచ్చి స్వీకరించు దేవ దేవుడు అని ప్రతీతి. శంకరుడిని భక్త కన్నప్ప వేట మాంసం ప్రసన్నం చేసుకున్నాడు అని కోటప్పకొండ చరిత్ర చెబుతుంది. కాని తెలంగాణకు వచ్చే సరికి రుద్రూడు ప్యూర్ విజిటేరియన్ దేవుడు. కాని ఎక్కడ లేని విధమైన ఒక ఆచారం సిరికొండ మండలంలో ఉంది. దేశం మొత్తం శివరాత్రి రోజు పూజలు ఉపవాసాలతో ఉంటే ఇక్కడ మాత్రం మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పుష్టిగా ఆరగిస్తుంటారు. శివరాత్రి రెండ్రోజులు ఇక్కడ సందడి సందడిగా ఉంటుంది.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లొంక అడవులలో వెలసిన శివలింగేశ్వర స్వామికి ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అంతా బాగుంది. కానీ స్వామి వారికి పెట్టే నైవేద్యం మాత్రం నాన్ వెజ్. మేకలను, కోళ్లను బలిచ్చి తమ భక్తిని చాటుకుంటున్నారు భక్తులు. శివలింగేశ్వర స్వామి శివుడికి మరోపేరు. ఇది నిజామాబాద్ – పూర్వ కరీంనగర్ జిల్లాల (రాజన్న సిరిసిల్లా జిల్లా) సరిహద్దులో సిరికొండ మండలంలోని దట్టమైన అడవులలో ఎత్తైన కొండలపై వెలసింది.
శివరాత్రి ఉత్సవాల సందర్బంగా అక్కడికి వేలాది మంది భక్తులు విచ్చేసి శివలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శివరాత్రి ఉత్సవాలు అనగానే ఉపవాసం ఉండటం అనవాయితి.. కానీ.. ఇక్కడ మాత్రం భక్తులు శివలింగేశ్వర స్వామి వద్ద మేకలను బలిచ్చి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ జిల్లా నుంచే కాకుండా పక్కజిల్లా కరీంనగర్ నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు. మేకలు, కోళ్లు బలిస్తూ.. పండగ చేసుకుంటారు. ఇక్కడ ఈ రెండ్రోజులు జాతర కూడా ఉంటుంది.
ఆలయ చరిత్ర..
త్రేతాయుగంలో సీతమ్మను రావనుడు అపహరించినప్పుడు ఆమె కోసం రాముడు వెతుకే క్రమంలో సిరికొండ మండలం లొంక అనేది ఆటవి ప్రాంతం గురించి వాడుక పేరు. ఇక్కడ శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మ జాడను వేతికే క్రమంలో అక్కడ శివ లింగంను ఎర్పాటు చేసి పూజించడం వలన శ్రీరాముడి పేరుని కలుపుకోని లోంక రామాలీంగేశ్వర స్వామీగా పిలుస్తారు. ఇప్పటికి ఈ ప్రాంతంలో శ్రీరాముడి పాదాల గుర్తులు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. అందుకే లొంకలోని రామ లింగేశ్వర స్వామిగా ఇక్కడి శివున్నికొలుస్తామంటున్నారు భక్తులు.
శివరాత్రి ఉత్సవాలు అంటెనే.. ఎంత నిబద్దతతో, క్రమశిక్షణతో ఉపవాసలు ఉండాల్సిందే... దేశంలోని శివాలయాలు శివరాత్రికి భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. కానీ.. సిరికొండ మండలంలోని దట్టమైన అడవులలో ఎత్తైన కొండలపై వెలసిన శివుడికి మాత్రం మహా శివరాత్రి సందర్బంగా మాంసంతో నైవేధ్యం పెడుతారు భక్తులు.. కోరిన కోరికలు నెరవేరాలంటే.. మేకలను శివుడికి బలి ఇవ్వాలని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు..
ఒకప్పుడు అన్నల ఇలాకా..
లోంక రామలీంగేశ్వర స్వామి ఆలయం ఉన్నది సిరికొండ దట్టమైన ఆడవిలో. అక్కడే శివరాత్రి పండుగ రోజు తప్పకుండా మేకలను బలిచ్చివిందు చేసుకుంటారు భక్తులు. బందువులను శివరాత్రికి ఆహ్వనించి విందు ఇస్తారట. ఏడాదంతా ఒక్కేత్తయితే ఈ రోజు తమకు వేరీ స్పెషల్ అంటున్నారు భక్తులు. ఈ రెండ్రోజులు ఇక్కడే ఉండి శివున్ని పూజించి హ్యాపీగా గడుపుతామని చెబుతున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు అన్నలకు పెట్టని కోట. నిజామాబాద్, కరీంనగర్ అన్నలకు షెల్టర్ జోన్. ఆలయానికి భక్తులు వస్తే తమ ఉనికి ఆసుపాసులు ఎక్కడ నిఘా వర్గాలకు తెలుస్తుందో అని అన్నలు శివరాత్రి నాటి ఉత్సవాలను అడ్డుకున్న దాఖాలాలు ఉన్నాయి. అన్నల ఉనికి తగ్గిన తరువాతనే గడిచిన ధశాబ్ధ కాలంగా అక్కడ వచ్చే భక్తుల సంఖ్య వేలకు చేరింది.
వద్ధన్న శివుడికి బలి ఇస్తున్నారు..
లొంక అడవులలో వెలసిన రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మేకలు బలిస్తున్నరన్నారు పూజారి . నీలకంఠశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజు పూజలు చేస్తామన్నారు.. కుషి పండుగ పేరిట శివరాత్రి నాడు మేకలను బలిస్తున్నరన్నారయన.. ఏ శివాలయంలో మేకలను బలివ్వడం లేదని.. అయితే. భక్తుల అనాగరికం.. తరతరాలుగా వస్తున్న ఆచారంతో మేకలను బలిస్తే మంచి జరుగుతుందనే విశ్వాషంతో మేకలను బలిస్తున్నరన్నారు.