ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి

by Sridhar Babu |
ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి
X

దిశ, కామారెడ్డి : ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల తహసీల్దార్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై సూచనలు, సలహాలు ఇచ్చారు. మండలాల వారీగా మృతి చెందిన ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక వ్యక్తి పేరు రెండు చోట్ల డబుల్ ఓట్ల వివరాలు సేకరించి, వారికి నోటీసులు అందజేసి ఒకచోటే జాబితాలో పేరు ఉండే విధంగా చూడాలని తెలిపారు.

జనవరి ఒకటి 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. ఓటు హక్కు కలిగి ఉండి ఇతర ప్రాంతాలకు వెళితే వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని సూచించారు. ధరణిలో పెండింగ్ ఫైళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఏవో మసూర్ అహ్మద్, ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story