గాలి దుమారం...డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇబ్బంది

by Sridhar Babu |

దిశ, కామారెడ్డి : భారీగా వీచిన ఈదురు గాలులు, వర్షానికి ఈవీఎం, వీవీ ఫ్యాట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల మైదానంలో ఎప్పటిలాగే అధికారులు ఈవీఎంలు, వీవీ ఫ్యాట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం అనుకోకుండా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులకు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టెంటు పడిపోయింది.

టెంటు నుంచి నీళ్లు రావడంతో సిబ్బంది నిలబడటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది సిబ్బంది ఫ్లెక్సీలు కప్పుకుని వర్షం పడకుండా జాగ్రత్త పడ్డారు. మరికొంత మంది తమ సామగ్రిని పట్టుకుని కళాశాల వరండాలోకి, వాహనాల్లోకి పరుగులు తీశారు. భారీ వర్షం కురవడంతో ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూటర్ చేసే కార్యక్రమం వద్ద ఉన్న టెంట్లు కుప్పకూలాయి. వీవీ ప్యాట్స్, ఈవీఎంలు తడవకుండా ఉంచేందుకు అధికారులు అనేక ఇబ్బందులుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed