కిషోర బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలి

by Sridhar Babu |
కిషోర బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలి
X

దిశ, కామారెడ్డి : కిషోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థినులకు సూచించారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ జాతీయ పోషణ మాసంలో భాగంగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ కేజీబీవీతో పాటు ఉన్నత పాఠశాల విద్యార్థులకు రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తహీనతపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రక్తహీనతను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

కిషోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, సకాలంలో వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కిషోర బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. ఈ సందర్భంగా 363 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంధుప్రియ, వైస్ చైర్మన్ అనిత, బీడబ్ల్యూవో బావయ్య, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఈఓ రాజు, సీడీపీఓలు, సూపర్వైజర్లు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed