ఈవీఎం గోడౌన్ కు చేరుకున్న అదనపు బ్యాలెట్ యూనిట్లు

by Sridhar Babu |
ఈవీఎం గోడౌన్ కు చేరుకున్న అదనపు బ్యాలెట్ యూనిట్లు
X

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ కు చేరుకున్నాయి. నిజామాబాద్ నియోజకవర్గ స్థానం నుండి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ కు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుండి అదనంగా వెయ్యి బ్యాలెట్ యూనిట్లను కేటాయించింది.

ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో బ్యాలెట్ యూనిట్లను ఈవీఎం గోడౌన్ లో భద్రపరిచారు. ఈసీఐఎల్ ఇంజినీర్లచే బ్యాలెట్ యూనిట్లను మొదటి దశ పరిశీలన(ఎఫ్.ఎల్.సీ) చేపట్టారు. ర్యాండమైజేషన్ నిర్వహించిన మీదట బ్యాలెట్ యూనిట్లను పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed