సీఎం రేవంత్ చొరవతో సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి.. సీఎంను కలిసిన నిర్మల్ వాసి..

by Ramesh N |   ( Updated:2024-10-05 11:00:48.0  )
సీఎం రేవంత్ చొరవతో సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి.. సీఎంను కలిసిన నిర్మల్ వాసి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురై రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్న నిర్మల్ జిల్లా వాసి రాథోడ్ నాందేవ్, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తన వేదనను తెలియజేస్తూ నాందేవ్ పంపిన వీడియోపై స్పందించిన సీఎం అతడిని తిరిగి దేశం రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తూ కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని భారతీయ ఎంబసీలతో సంప్రదింపులు జరిపి నాందేవ్‌ను స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నారు.

హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్న నాందేవ్‌ తన కుటుంబ సభ్యులతో వచ్చి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఎరావత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, భీమ్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ రెడ్డి ఉన్నారు. ఈ విషయాలు తెలంగాణ సీఎంఓ అధికారిక ఖాతా శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది.

Advertisement

Next Story