- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేష్ శోభాయాత్రపై నిఘా నేత్రం
దిశ ప్రతినిధి,నిజామాబాద్ : వినాయక నిమజ్జన శోభాయాత్రను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. శోభాయాత్ర కొనసాగుతున్న తీరును, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను వీక్షించారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీసులు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న తీరును నిశితంగా పర్యవేక్షించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన చోట స్థానిక పోలీసులను కమాండ్ కంట్రోల్ స్టేషన్ నుండి అప్రమత్తం చేశారు.
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి కావడంతో వారు ప్రజలకు, గణేష్ మండలి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో నిమజ్జనోత్సవ వేడుకలు జరుగుతున్న తీరును ఆద్యంతం పర్యవేక్షించారు. భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే గోదావరి పరీవాహక ప్రాంతాలైన బాసర బ్రిడ్జి, ఉమ్మెడ వద్ద అధునాతన సాంకేతికతతో కూడిన క్రేన్లు అందుబాటులో ఉంచారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్, ఫిషరీస్, ఫైర్ తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిమజ్జనోత్సవం సజావుగా జరిగేలా కృషి చేశారని తెలిపారు.