- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కడున్నావురా కొడుకా..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖండ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20)అనే యువకుడు మిస్సింగ్ అయినట్లు బోధన్ రూరల్ ఠాణా ఎస్సై లోకం సందీప్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాంత్ బోధన్ పట్టణంలోని ఉషోదయ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. రోజు మాదిరిగానే గత నెల 23న కళాశాలకు వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో శ్రీకాంత్ తండ్రి లక్ష్మణ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. శ్రీకాంత్ ఫోన్ నెంబర్లను సీడీఆర్ లో పెట్టామని ఎస్సై తెలిపారు. సీడీఆర్ డాటా వచ్చిన వెంబడే ఎనలైజ్ చేసి అబ్బాయిని ట్రేస్ అవుట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
బోధన్ మహరాష్ర్ట సరిహద్ధులోని ఖండ్ గావ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు, శివ జ్యోతి దంపతులకు శ్రీకాంత్ తో పాటు మరొక కొడుకు ఉన్నాడు. శ్రీకాంత్ ఓక్కడే ఎక్కువగా చదవుపై శ్రద్ధ చూపడంతో అతన్ని ఉన్నత విద్యావంతుడిగా చేసేందుకు కుటుంబం మొత్తం వ్యవసాయం చేస్తు కష్టపడుతున్నారు. వారు కోరుకున్నట్టే శ్రీకాంత్ సైతం పదో తరగతి, ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. కాని కొడుకును దూరం పంపించలేక బోధన్ లోనే డిగ్రీ చదివిస్తున్నారు. కాని డిగ్రీ చదివే సమయంలో స్థానికంగా బోధన్ కు చెందిన సహవిద్యార్థినితో అతడు ప్రేమలో పడినట్లు తెలిసింది. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసి గొడవలు జరిగినట్లు సమాచారం.
గతనెల 23న తన ఇంటినుంచి శ్రీకాంత్ కళాశాలకు వెలుతున్నా అని చెప్పిన క్షణాలు చివరి మాటలు అయ్యాయి. ఆరోజు సాయంత్రం వరకు కొడుకు కోసం ఎదురు చూసిన తల్లిధండ్రులకు అతను తిరిగి ఇంటికి రాకపోవడం, అతడి సెల్ పోన్ స్విచ్చాఫ్ కావడంతో వారిలో కలవరం మొదలైంది. స్ధానిక పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలిస్ లు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలించినా ఫలితం లేకపోవడంతో శ్రీకాంత్ అచూకి తెలిపిన వారికి రూ.50,000 నగదు అవార్డును ప్రకటించారు. తమ కొడుకును అమ్మాయి తరుపు వారే కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించారు. తమ కొడుకును తిరిగి క్షేమంగా అప్పగిస్తే చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా వారు పోలిస్ వారితో పాటు కొడుకు అచూకి కోసం వెతకని ప్రాంతం లేదు. తమ కొడుకుకు ఎదైనా జరిగితే బ్రతకలేమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.