సైబర్ మోసం.. రూ.1.40 లక్షలు మాయం..

by Sumithra |
సైబర్ మోసం.. రూ.1.40 లక్షలు మాయం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కు చెందిన ఓ అభాగ్యుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ. 1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహమ్మద్ ముజాహిద్ కు ఇటీవల ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని బ్యాంకు రుణం కోసం మీరు చేసుకున్న దరఖాస్తు అప్రూవ్ అయిందని, లోన్ కూడా సాంక్షన్ అయ్యిందని తెలిపారు.

నేను మీకు వీడియో కాల్ చేస్తాను.. నా కాల్ లిఫ్ట్ చేయండి అని సదరు వ్యక్తికి అపరిచిత వ్యక్తి సూచించాడు. దీన్ని నిజమని నమ్మిన బాధితుడు అవతలి వ్యక్తి చేసిన వీడియో కాల్ ను లిఫ్ట్ చేసాడు. అంతే, వెంటనే ముజాహిద్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.40 లక్షలు మాయమయ్యాయి. తన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు మాయమైన విషయం తెలియగానే లబోదిబోమంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై యాసర్ అరాఫత్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed