వన్యప్రాణుల ప్రాణాలను తోడేస్తున్న జాతీయ రహదారి

by Sumithra |
వన్యప్రాణుల ప్రాణాలను తోడేస్తున్న జాతీయ రహదారి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ - కామారెడ్డి జిల్లా సరిహద్దులోని చంద్రయాన్ పల్లి - దగ్గి అటవి ప్రాంతంలో వన్య ప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నాయి. గురువారం రాత్రి మంచిప్ప రిజర్వు పారేస్టు కలిగిన 44వ జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిరుత దుర్మరణం చెందింది. జాతీయ రహదారి కావడంతో వాహనాలు మితిమీరిన వేగంతో నడుస్తున్నాయి. అక్కడ జాతీయ రహదారి నిర్వహణ పై నేషనల్ హైవే అథారిటీ అధికారులు నియమనిబంధనలు పాటించకపోవడంతో వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారింది. రాత్రి వేళ రోడ్డు దాటుతున్న వన్యప్రాణులను వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆరు నెలల కాలంలో మూడు చిరుత పులులు, ఒక ఎలుగుబంటి చనిపోయాయి.

ఈ రోడ్డు ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చిట్టడవులకు ప్రసిద్ధి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాను కలుపుకొని ఆటవి ప్రాంతం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు మొదలుకుని మంచిప్ప బీట్ వరకు దట్టమైన అడవి ఉంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ నియెజకవర్గాలకు విస్తరించిన అటవి ప్రాంతంలో వన్యప్రాణులకు కొదవ లేదు. చిరుతలు, జింకలు, ఎలుగు బంటులు, ఎదులు నెమళ్లు, కుందేళ్లు లాంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. ఆటవి శాఖాధికారులు వేటను నిషేదిస్తూ వన్యప్రాణి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవడం లేదు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడటంతో అటవీశాఖాధికారులు సఫలం అవుతున్న రోడ్డు ప్రమాదాలలో ఆటవి జంతువుల మరణాలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంలో జాతీయ రహదారుల నిర్వహకుల ప్రికాషన్స్ తీసుకుంటేనే ప్రయోజనం.

జాతీయ రహదారిపై ఆటవి జీవుల కాపాడటానికి.. వీలైతే రిజర్వ్ ఫారెస్ట్ లో రాత్రి పూట బారికేడ్ పెట్టి, వాహనాల స్పీడ్ ను రెగ్యులేట్ చేసి, తద్వారా వన్యప్రాణులను కాపాడడానికి చర్యలు చేపట్టాలి అని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు. హైదరాబాద్ రోడ్లలో స్పీడ్ ను కంట్రోల్ చేయడానికి వేసే వైట్ ప్యాచెస్ లాంటివి ప్రతీ అరకిలోమీటరు దూరం లో వేస్తే వాహనాల స్పీడ్ ను కొంతవరకు నియంత్రించవచ్చు. తద్వారా యాక్సిడెంట్ అయ్యి వన్యప్రాణులు చనిపోయే దానికి కొంత వరకు తగ్గించవచ్చు. రిజర్వు అటవీ ప్రాంతంలో స్పీడ్ నియంత్రణ చర్యలు చేపడితే బాగుంటుందని ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగాలు ఉమ్మడి జిల్లా అధికారుల సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తే ఆటవి జంతువులను కాపాడే వీలు ఉండటమే కాకుండా వేటను కూడా నియంత్రించవచ్చు.

Advertisement

Next Story