- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు నెలలుగా ఆస్పత్రిలో కూతురు.. ఆపన్నహస్తం కోసం చేయి చాచిన తండ్రి
దిశ, కామారెడ్డి: చిన్నప్పటినుంచి చదువులో ముందంజలో ఉన్న ఆమె ఇంటర్ డిగ్రీలో జిల్లా టాపర్‌గా నిలిచింది. డిగ్రీ పూర్తి చేసిన ఆ యువతి ప్రస్తుతం ఐదు నెలలుగా ఆస్పత్రి బెడ్ పైనే ఉండిపోయింది. మెదడులో రక్తం గడ్డకట్టి చికిత్స పొందుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చదువుల తల్లి రుబీనా గాథ ఇది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కాలనిలో యూసుఫ్ అనే వ్యక్తి కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. మెకానిక్‌గా పనిచేస్తున్న యూసుఫ్ కూతురు రుబీనాకు చదువుపై ఉన్న ఇష్టాన్ని చూసి తన కష్టాన్ని సైతం మరిచి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. కూతురు కూడా ఎక్కడా తప్పటడుగు వేయకుండా చదువులో అదరగొడుతూ ఇంటర్, డిగ్రీలో జిల్లా టాపర్‌గా నిలిచింది. డిగ్రీ పూర్తి చేసిన రుబీనా గతేడాది సెప్టెంబర్ 6న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకుంది.
వ్యాక్సిన్ తీసుకున్న రెండ్రోజులకు ఛాతీలో నొప్పితో పడిపోగా, జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆమెకు పరీక్షలు చేయించారు. వైద్యుల సూచన మేరకు కాచిగూడలోని సాయికృష్ణ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ రుబీనాను పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టిందని చికిత్సకు 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పారు. ఇలా సుమారుగా ఇప్పటివరకు రూ.16 లక్షల వరకు ఖర్చు చేసాడు యూసుఫ్. చివరకు తనకు ఉన్న ఇంటిని కూతురు చికిత్స కోసం అమ్మేశాడు. మూడు నెలల తర్వాత ఆపరేషన్ చేయగా రుబీనా మామూలు స్థితికి వచ్చింది. రెండు నెలలుగా ఇంకా చికిత్స కొనసాగుతోంది.
అయితే, మెదడులో ఒక బోన్ వేయాల్సి ఉందని, దానికి మరొక 3 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న యూసుఫ్ ఎలాగోలా రూ.2.40 లక్షలు సర్దుబాటు చేసుకోగలిగాడు. పేదరికంలో ఉన్నా.. కూతురు కంటే ఏది ఎక్కువ కాదనుకున్నాడు. ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్న యూసుఫ్‌కు కూతురి ఆపరేషన్ కోసం మరో రూ.60 వేలు సంపాదించడం కష్టతరంగా మారింది. చివరికి గత్యంతరం లేక అపన్నహస్తం కోసం ఆర్థిస్తున్నాడు. 'నా కూతురు చదువులో ముందంజలో ఉంది. ఇప్పుడు అచేతనంగా ఆస్పత్రిలో పడి ఉంది. నా కూతురు కోలుకోవడానికి రూ.60 వేలు కావాల్సి ఉంది. దయచేసి సహాయం చేయండి' అంటూ యూసుఫ్ దాతలను వేడుకుంటున్నాడు. తనకు 9493106370 నంబరుకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తోచిన విధంగా సహాయం చేయాలని వేడుకున్నాడు.