కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

by Sridhar Babu |
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
X

దిశ, బాన్సువాడ : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేసీఆర్ రోడ్ షో లు, క్షేత్ర స్థాయిలో నాయకుల ప్రచారం తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బాగా పుంజుకుందని, సర్వేల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 10 నుండి 12 పార్లమెంట్ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీకి 200 స్థానాలు కూడా రావని, కాంగ్రెస్ పార్టీ శక్తి తగ్గుతుందన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని, మే 13 న జరిగే పోలింగ్ లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని అన్నారు.

ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అని ప్రజలు గ్రహించారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని, దేశంలో ఇంత తొందరగా అపనమ్మకం తెచ్చుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. హామీలను అమలు చేయకుండా విషయాన్ని పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని అన్నారు. ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో మార్పులు వస్తాయన్నారు. బీజేపీ వాళ్లు దేశానికి ఏం చేశారో చెప్పాలన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి 3.80 లక్షల కోట్లు ట్యాక్స్ ల రూపంలో వెళితే తిరిగి రాష్ట్రానికి 1.80 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తే కేంద్రం నుండి నిధులు తెస్తారని, కాంగ్రెస్ పార్టీకి అంత శక్తి లేదన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, సోసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు గురు వినయ్ కుమార్, నార్ల రవీందర్ గుప్త, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, ఏజాజ్, వాహాబ్,పోతారెడ్డి, నార్ల ఉదయ్ గుప్త, లింగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed