నువ్వు విషం తాగు పెళ్లి చేసుకుంటా.. కొత్త పెళ్లికూతురును రెచ్చగొట్టిన ప్రియుడు..

by Sumithra |
నువ్వు విషం తాగు పెళ్లి చేసుకుంటా.. కొత్త పెళ్లికూతురును రెచ్చగొట్టిన ప్రియుడు..
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని నేరల్ గ్రామానికి చెందిన ఓ యువతికి లింగంపేట్ మండలం సిరాయిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకునితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఇదివరకే ప్రేమలో ఉన్న యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు తరచూ కలుస్తూ ఫోన్లు మాట్లాడుతూ భర్తకు తెలియకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఆ తరువాత అస్సలు కథ నడిచింది. తాను ప్రేమించిన యువకుడు యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తన భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు. దాని కోసం ఓ పెద్ద ప్లాన్ కూడా వేశాడు.

లింగంపేట్ లోని సిరాయిపల్లి గ్రామానికి యువతి ప్రేమికుడు వచ్చి విషం తాగాడు. తన మీద ప్రేమ ఉన్నట్టు నమ్మబలికించి యువతిని విషం తాగేట్టు ప్రేరేపించాడు. విషం తాగితే తనని కాపాడతానని, తరువాత తన భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చని తెలిపాడు. తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు, ప్రియురాలికి హామీ ఇచ్చాడు. దాంతో యువతి కూడా విషం తాగగా లింగంపేట్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం అందించారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు ఆధ్వర్యంలో విచారణ జరపగా తన ప్రియుడు చెప్తే ఇలా చేశానని యువతీ తెలిపింది. ఇదంతా తెలిసిన భర్త ఆ యువతి నుండి విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న తర్వాత నేరల్ గ్రామంలో ప్రేమించిన యువకుని ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. దాంతో ఏం చేయాలో తెలియని యువతి సోమవారం గాంధారి పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇచ్చారని ఏఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed