వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |
వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
X

దిశ,బోధన్ : బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్ ప్రాంతంలో గల లయోలా స్కూల్ ప్రాంతంలో బుధవారం వీధి కుక్కలు ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం వీధి కుక్కల నియంత్రణపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ బాలుడి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు బోధన్ ఆర్డీవో,

పురపాలక సంఘం అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వీధి కుక్కల దాడులు నిత్యం చోటు చేసుకుంటున్నప్పటికీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ వీధి కుక్కల దాడులలో అనేక మంది చిన్నారులు, ప్రజలు గాయాలపాలవుతున్న తరుణంలో అధికారులు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed