ఇంటర్ సప్లిమెంటరీలో 58.39% ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి..

by Sumithra |
ఇంటర్ సప్లిమెంటరీలో 58.39% ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి గాను గత మే నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరంలో 58.39 శాతం విద్యార్థులు పాస్ కాగా బాలికలదే పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి టి. రవికుమార్ తెలియజేశారు. సోమవారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.39% ఉత్తీర్ణులు కాగా రెండవ సంవత్సరం విద్యార్థులు 54.11% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ లో మొత్తం 10,270 మంది విద్యార్థులు హాజరు కాగా 5,997 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 58.39% పాస్ అయ్యారు. అలాగే రెండవ సంవత్సరంలో జనరల్ లో మొత్తం 6,074 మంది హాజరు కాగా 3,287 మంది పాసై 54.11% ఉత్తీర్ణులయ్యారు.

అలాగే ఒకేషనల్ లో మొదటి సంవత్సరం మొత్తం 1,159 మంది విద్యార్థులు హాజరు కాగా 562 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 48.49 శాతం ఉత్తీర్ణత సాధించారు.

రెండవ సంవత్సరంలో 978 మంది విద్యార్థులు హాజరు కాగా 441 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 45.09% ఉత్తీర్ణత సాధించారు.

కాగా మొదటి సంవత్సరం జనరల్ లో బాలురు 5,232 మంది హాజరు కాగా 2,622 మంది ఉత్తీర్ణులై 50.11% ఉత్తీర్ణత సాధించారు. అలాగే బాలికలు 5,038 మంది హాజరు కాగా 3,375 మంది పాసై 66.99% ఉత్తీర్ణత సాధించారు.

రెండవ సంవత్సరంలో జనరల్ బాలురు 3,524 మంది హాజరు కాగా 1,855 మంది పాసై 52.64% ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలికలు 2,550 మంది హాజరు కాగా 1,432 మంది ఉత్తీర్ణులై 56.16% ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ లో మొదటి సంవత్సరం బాలురు 882 మంది హాజరు కాగా 393 మంది పాసై 44.56% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 277 మంది హాజరు కాగా 169 మంది పాసై 61.01 ఉత్తీర్ణత శాతం సాధించారు. అలాగే ఒకేషనల్ రెండవ సంవత్సరం బాలురు 806 మంది హాజరు కాగా 367 మంది ఉత్తీర్ణులై 45.53% ఉత్తీర్ణత సాధించారు. అలాగే బాలికలు 172 మంది హాజరు కాగా 74 మంది పాసై 43.02% ఉత్తీర్ణత సాధించారు.

Next Story

Most Viewed