తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ.. వాయిదా

by srinivas |   ( Updated:2024-10-03 15:35:21.0  )
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ.. వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) వాయిదా వేసింది. శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి(Former MP Subrahmanya Swamy), టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(Former TTD Chairman YV Subbareddy)తో పాటు పలువురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. లడ్డూ వివాదంపై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత(Solicitor General Tushar Mehta)ను విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10.30కు విచారణను కోర్టు వాయిదా వేసింది.

కాగా గత విచారణలో ఏపీ ప్రభుత్వం, టీటీడీపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదంపై వ్యాఖ్యలు చేయడం కోట్లాదిమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూ రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీరియస్‌గా చెప్పింది.

అయితే తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. ఇప్పటికే తిరుమలలో మూడు రోజులపాటు సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణను సిట్ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో దర్యాప్తుపై సిట్ నిర్ణయం తీసుకోనుంది.

కాగా తిరుమల లడ్డూ వివాదంపై సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు జరపాలని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ దర్యాప్తుపై కేంద్రం వైఖరి తెలిపిన తర్వాత ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed