- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజామాబాద్ లో ప్రజావాణికి 56 ఫిర్యాదులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ గోవింద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం 56 వినతులు వచ్చాయి.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యల గురించి అర్జీదారులకు సమాచారం తెలియజేస్తూ, ఆన్ లైన్ సైట్ లోనూ వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
కామారెడ్డిలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాట్లాడారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జనహిత ద్వారా ఆన్ లైన్ లో వచ్చే ప్రతీ దరఖాస్తును అధికారులు పరిశీలించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీఓ సాయన్న, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.