12వ పీఆర్సీ కమిటీ వేసి కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ధర్నా..

by Sumithra |   ( Updated:2023-08-22 09:53:28.0  )
12వ పీఆర్సీ కమిటీ వేసి కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ధర్నా..
X

దిశ, నిజామాబాద్ సిటీ : రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ నేటికీ 12వ పీఆర్సి కమిటీని వేయకపోవడం సిగ్గుచేటని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పర్మినెంట్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 11వ పీఆర్సీ సంబంధించిన కాల పరిమితి జూన్ 30వ తారీకుతో ముగిసిందని జులై ఒకటో తేదీ నుండి 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చి తద్వారా కార్మికుల వేతనాలు పెరగాల్సినటువంటి అవసరం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ నేటికీ 12వ పీఆర్సీ కమిటీని వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం చూస్తుంటే ఐఆర్ (మద్యంతర భృతిని )చెల్లించి పీఆర్సీని చెల్లించకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి కనపడుతుందని ఆ విధంగా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగులు, కార్మికులు ఎన్నికల్లోతగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికుల సంఖ్యను పెంచిన పనిచేస్తున్న కార్మికుల పై పని భారం తగ్గటం లేదని కమిషనర్ చొరవ తీసుకొని పర్యవేక్షణ చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎన్ఎమ్ఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేలకు నిర్ణయించాలని బకాయిలో ఉన్న డీఏలను చెల్లించాలని సబ్బులు, చెప్పులు, నూనెలో పనిముట్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేసి ప్రకటించని యెడల సమ్మెకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.హనుమాన్లు నాయకులు నరసమ్మ, సాయి, బాలాజీ, కిషోర్, గోపి, సుజాత, ధర్మవ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story