నిజామాబాద్ సభ వాయిదా.. అత్యవసరంగా ఢిల్లీకి రాహుల్

by Javid Pasha |   ( Updated:2023-10-19 12:49:33.0  )
నిజామాబాద్ సభ వాయిదా.. అత్యవసరంగా ఢిల్లీకి రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజా క్షేత్రంలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం రాహుల్ తెలంగాణ పర్యటనకు రాగా.. బస్సు యాత్రను ములుగు జిల్లాలో ప్రారంభించారు. నేడు కూడా బస్సు యాత్రను కొనసాగిస్తుండగా.. శుక్రవారం కూడా చేపట్టనున్నారు. అయితే రేపు ఆర్మూరుతో పాటు నిజామాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటించాల్సి ఉంది.

కానీ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో ఆర్మూర్ సభతో రాహుల్ మూడు రోజుల పర్యటన ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలో సభ నిర్వహించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఆర్మూర్ బహిరంగ సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాహుల్ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో మరోసారి తెలంగాణ పర్యటనకు రాహుల్ రానున్నారు. రేపటితో తొలి విడత బస్సు యాత్ర ముగియనుండగా.. దసరా తర్వాత రెండో విడత బస్సు యాత్ర జరగనుంది. ఈ యాత్రలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు.

Advertisement

Next Story