‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై దుష్ప్రచారం.. పోలీసులకు విజయదేవరకొండ మేనేజర్ ఫిర్యాదు

by srinivas |   ( Updated:2024-04-07 16:58:00.0  )
‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై దుష్ప్రచారం.. పోలీసులకు విజయదేవరకొండ మేనేజర్ ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: మాదాపూర్ పోలీసులకు విజయదేవరకొండ మేనేజర్ పిర్యాదు... ఈ మూవీ విడుదలై విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే సోషల్ మీడియాతోపాటు కొన్ని వాట్సాప్ గ్రూపులో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విజయదేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, ఫాన్స్ అస్సోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై పనిగట్టుకొని ఫ్యామిలీ స్టార్ సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో అనురాగ్ పర్వతనేని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలవల్ల తమ సినిమా వసూళ్లపై ప్రభావం పడుతుందని చెప్పారు. సినిమా చూసాక యూట్యూబ్‌లో ఉదేశ్యపూర్వక థంబ్ నైల్స్ పెట్టి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయదేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story