- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెస్టులు లేకుండానే తెలంగాణ విమోచన దినోత్సవం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును ఒక్కో పార్టీ ఒక్కోలా నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట అధికారికంగా వేడుకలను నిర్వహిస్తుంటే.. రాష్ట్ర సర్కారు ‘ప్రజాపాలన దినోత్సవం’ పేరిట నిర్వహిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మూడోసారి విమోచన వేడుకలను జరుపుతోంది. ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన దూరమయ్యారు. దీంతో ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అటెండవుతున్నారు. గతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల సీఎంలు కానీ, మంత్రులు కానీ, వారి ప్రతినిధులు కానీ హాజరయ్యేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది.
ఇతర రాష్ట్రాలకు అందని ఆహ్వానం!
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి వేడుకకు ఇతర రాష్ట్రాల నుంచి గెస్టులను ఆహ్వానించలేదని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన వారి వరకే వేడుకలను పరిమితం చేశారు. గతంలో రెండుసార్లు కర్ణాటక, మహారాష్ట్రకు ఆహ్వానం అందించగా ఈసారి వారికి ఇన్విటేషన్ అందలేదని సమాచారం. తొలిసారి వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. అలాగే కర్ణాటక తరఫున ముఖ్యమంత్రికి బదులు అప్పటి మంత్రి శ్రీరాములు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి వేడుకలకు సైతం ఆహ్వానం అందింది. ముఖ్య నేతలు రాకున్నా వారి ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఈసారి ఆహ్వానం కూడా అందలేదని సమాచారం.
గౌరవ అతిథిగా గజేంద్రసింగ్ షెకావత్
పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలను మంగళవారం ఉదయం 8 గంటలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభిస్తారు. దీనికంటే ముందు బీజేపీ రాష్ట్ర ఆఫీసులో నిర్వహించే విమోచన వేడుకలకు ఆయన హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్‌లో కిషన్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆపై పారా మిలబరీ బలగాలు కవాతును నిర్వహించనున్నాయి. వారితో పాటు ఈ వేడుకల్లో మొత్తం పది ట్రూపుల కళాకారులు పాల్గొంటున్నారు. ఇందులో తెలంగాణకు చెందిన ఆరు ట్రూపులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్రకు రెండేసి చొప్పున 4 ట్రూపులు కళలను ప్రదర్శించనున్నాయి. ఈ కళా బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. ఈ వేడుక కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో గౌరవ అతిథిగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణకు రానున్నారు. ఆయనతో పాటు అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం పాల్గొంటారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా పాల్గొనే అవకాశం ఉంది.
విమోచన వేడుకతో పాటు ఘనంగా పీఎం బర్త్ డే
విమోచన వేడుకతో పాటు ప్రధాని మోడీ పుట్టినరోజు సైతం ఉండటంతో భారీగా చేపట్టాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగా ‘సేవా మహాయజ్ఞం’ పేరిట పార్టీ రాష్ట్ర ఆఫీసులో మంగళవారం ఉదయం 11:30 గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీలు, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు తదితరులు పాల్గొంటారని పార్టీ స్పష్టం చేసింది.