- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
VC Sajjanar : కొత్త సంవత్సరం వేడుకలను..ఇంట్లోనే జరుకోండి : వీసీ సజ్జనార్

దిశ, వెబ్ డెస్క్ : నేరాలు..ప్రమాదాల పట్ల నిత్యం ప్రజలను అప్రమత్తం చేసే టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్(VC Sajjanar)కొత్త సంవత్సరం వేడుక(New Year Celebrations)ల సందర్భంగా ప్రజలకు ఎక్స్ వేదికగా విలువైన సూచనలు చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను మీ ఇంట్లో(Celebrate at Home)నే..మీ కుటుంబ సభ్యులతో జరుపుకోండని..ప్రమాదాలకు దూరం(Away From Dangers Accidents)గా సంతోషంగా ఉండండని వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. గతంలో కొత్త సంవత్సర వేడుకలు మిగిల్చిన విషాదాలను గుర్తు చేస్తూ, న్యూ ఇయర్ ఎంజాయ్ పేరుతో మద్యం తాగి వాహనాలు నడిపి అలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దంటూ హితవు పలికారు.
అందుకే ఈ కొత్త సంవత్సరం వేడుకలను సంతోషంగా సురక్షితంగా ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతో జరుపుకోండని సజ్జనార్ పిలుపునిచ్చారు. అలాగే మీ న్యూ ఇయర్ ను రోడ్డు ప్రమాదరహితంగా ప్రారంభించండి! మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని తెలిపారు. ఎంజాయ్ పేరుతో చేసే బైక్ రేసింగులు అత్యత ప్రమాదకరమని గుర్తుంచుకోండని..మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం.. తల్లిదండ్రుల్లారా..! కొత్త ఏడాది కదా అని పిల్లలకు వాహనాలు ఇవ్వకండని హెచ్చరించారు.