- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
యూజీసీ రూల్స్‌తో నష్టపోతున్న లోకల్ స్టూడెంట్స్!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీలకు యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమి షన్) ఇస్తున్న రూల్స్‌తో లోకల్ స్టూడెంట్లకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఆయా విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కన్వీనర్ కోటా వర్తింపజేయకపోవడంతో లోకల్ స్టూడెంట్లు లాస్ అవుతున్నారని ఇటీవల కొందరు విద్యార్ధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీన్ని అధ్యయనం చేసిన సర్కార్, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మన స్టేట్ లో ఇటీవల మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్‌డ్ వర్సిటీ హోదాను ఇస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా ప్రత్యేక (డిస్టింక్ట్) కేటగిరీ కింద డీమ్‌డ్ హోదా ఇస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఆయా కాలేజీల్లో కన్వీనర్ కోటా, రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేకుండానే అనుమతులు జారీ చేసింది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వాహణ, ప్రశ్నాపత్రాల మూల్యంకనం వంటివన్నీ యూనివర్సిటీ హోదాలో సొంతగానే చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ లోకల్ కోటా అమలుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇక్కడి విద్యార్ధులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. నార్త్ స్టేట్ లో అధికంగా ఉండే డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల కల్చర్ క్రమంగా తెలంగాణ లో పెరుగుతుంది. ఇప్పటికే అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా నీలిమా మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వగా, ఈసారి మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ మంజూరు చేసింది. అంతేగాక అపోలో సహా మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. భవిష్యత్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ డీమ్డ్ హోదా కోసం ప్రయత్నాలు చేస్తాయని మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు.
ఏం జరుగుతుంది..?
డీమ్డ్ హోదా పొందిన యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లను కేవలం మేనేజ్ మెంట్ కోటా(బీ కేటగిరీ) లో మాత్రమే భర్తీ చేస్తున్నారు. పైగా లోకల్ రిజర్వేషన్ లేకుండానే సీట్లు నింపుతున్నారు. కేంద్రం ఇచ్చే ప్రత్యేక రూల్స్ తోనే ఇలాంటి పరిస్థితి తయారైంది. పైగా ఆయా యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ కూడా లేకపోవడం తో లోకల్ కోటాతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లేవీ అమలు కావడం లేదు. దీంతో మేనేజ్ మెంట్ కోటాలో టాలెంట్ కంటే, డబ్బులున్నోళ్లకే సీట్లు లభిస్తున్నాయనే ప్రచారం జరుగుతున్నది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ కోటాలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు ఎన్ ఆర్ ఐ విద్యార్ధులకైనా సీట్లు కేటాయించవచ్చు. దీన్ని డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు బాగా వినియోగించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి యూనివర్సిటీలు పెరగడంతో కన్వీనర్ కోటా సీట్లు తగ్గిపోతున్నాయి. తద్వారా మెరిట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మేనేజ్‌మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీని వలన తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని మెడికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు నీట్‌లో మెరిట్ ర్యాంకులు సాధించకపోయినా, ధనవంతుల వర్గాలకే అలాంటి కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. దీని వలన క్వాలిటీ డాక్టర్లు తయారయ్యే పరిస్థితి ఉండదని అధికారులు చెప్తున్నారు. ఇది ఆటోమెటిక్ గా ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పైగా ఈ యూనివర్సిటీలు కాళోజీ హెల్త్ పరిధిలో ఉండవు. దీంతో ఎగ్జామ్స్ కూడా సొంతంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా వర్సిటీ విద్యార్ధులకు మంచి మార్కులు వేసి పాస్ చేయించే ఛాన్స్ ఉంటుంది. తద్వారా ఎంబీబీఎస్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసే మెడికల్ ఆఫీసర్ల పోస్టుల్లో వీళ్లే టాప్ లో నిలుస్తారు. దీంతో ప్రభుత్వ సెక్టార్ లో మెరుగైన వైద్యం అందడం కష్టంగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
అడ్డగోలుగా ఫీజులు...?
డీమ్‌డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలకు రూ.వందల కోట్ల లబ్ది చేకూరుతోంది. ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ.60 వేలు మాత్రమే ఉండగా, మేనేజ్‌మెంట్ కోటా ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. ఆయా కాలేజీల్లో ఉన్న వసతులను బట్టి ఈ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయిస్తోంది. కానీ డీమ్‌డ్ యూనివర్సిటీలు ఫీజు రెగ్యులేటరీ కమిటీతో సంబంధం లేకుండా, సొంతగానే తమ ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని యూజీసీ కల్పిస్తోంది. దీని వలన మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు సుమారు రూ.17.5 లక్షలుగా ఉన్నట్లు కాళోజీ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్వీనర్ కోటా ఫీజు 200 సీట్లకు ఏడాదికి రూ.1.2 కోట్లు వస్తే, ఇప్పుడు అదే 200 సీట్లకు ఏడాదికి రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఒక్క బ్యాచ్ స్టూడెంట్ల మీద ఏకంగా రూ.175 కోట్లు సమకూరుతుంది.
మల్లా రెడ్డి కాలేజీలో ఇలా..?
మల్లారెడ్డి కాలేజీలోని 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 150 బీడీఎస్(డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి. గతేడాది వరకూ ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్స్‌కు ఈ సీట్లు దక్కేవి. మెరిట్ ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించేవారు. కానీ, ఇకపై ఈ రూల్స్ ఏవీ అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డికి మినహాయింపులు ఇచ్చింది. మల్లారెడ్డి చూపిన బాటలో అపోలో, సీఎంఆర్ కాలేజీలు కూడా డీమ్‌డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వీనర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహాకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని, డీమ్‌డ్ వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల పేరెంట్స్ చెబుతున్నారు
సీట్లు ఇలా మిస్సయ్యాయ్..
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 35 శాతం సీట్లను బీ(మేనేజ్ మెంట్) కేటగిరీలో, 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన నీలిమా మెడికల్ కాలేజీలోని 150 సీట్లలో 75 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లలో, 200 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యూజీసీ వాటికి ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇవ్వడంతో సీట్లన్నీ మేనేజ్‌మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. వాస్తవానికి, కన్వీనర్ కోటా సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించి, ఆ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష కంటే తక్కువే ఖర్చు అవుతుంది