- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లహరి విషాదాంతంలో కొత్త మలుపులు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లహరి విషాదాంతంలో కొత్త కొత్త ట్విస్టులు ముందుకొస్తున్నాయి. జరిగింది హత్యేనంటూ వచ్చిన పోస్టుమార్టం నివేదిక మేరకే లహరి భర్త, కాంగ్రెస్ నేత వల్లభ్ రెడ్డిపై హత్య, సాక్ష్యాధారాలను రూపుమాపాడన్న నేరారోపణలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు లహరి తండ్రి మాత్రం తన కూతురు అనారోగ్యం వల్లనే చనిపోయిందని అంటున్నాడు. తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నాడు. తన అల్లుడు, అతని కుటుంబసభ్యులు దేవుళ్లతో సమానమని అంటున్నాడు. అయితే, లహరి మరణం ఇటు హైదరాబాద్ తో పాటు అటు నల్గొండ జిల్లాలో ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది.
దీనికి మరో కారణం వల్లబ్ రెడ్డిని కేసు నుంచి బయట పడేసేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇప్పటికీ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తుండటం. అంబర్ పేట జైస్వాల్ గార్డెన్ ప్రాంత నివాసి జైపాల్ రెడ్డి పెద్ద కూతురు లహరి. 2022, ఏప్రిల్4న ఆమె వివాహం నల్గొండ జిల్లా కాంగ్రెస్ యువకుడు యడవల్లి రంగసాయి రెడ్డి కుమారుడు, హిమాయత్ నగర్ వాసి అయిన వల్లబ్ రెడ్డితో జరిగింది. ఇదిలా ఉండగా ఈనెల 14న లహరి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది.
ఈ క్రమంలో నారాయణగూడ పోలీసులు కేసులు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ సమయంలో వల్లబ్ రెడ్డి తన భార్య లహరి ఉన్నట్టుండి వంట గదిలో కుప్పకూలి పోవటంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించానని, చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులతో చెప్పాడు. గుండెపోటుతో లహరి మరణించినట్టుగా డాక్టర్లు చెప్పారన్నాడు. ఇక, లహరి తండ్రి జైపాల్ రెడ్డి కూడా తన కూతురి మరణంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో పోలీసులు సైతం లహరి గుండెపోటుతోనే చనిపోయి ఉండవచ్చని భావించారు.
నిజాన్ని బయటపెట్టిన పోస్టుమార్టం నివేదిక..
అయితే, లహరి మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన ఫోరెన్సిక్ వైద్యులు ఆమె గుండెపోటుతో చనిపోలేదని నిర్ధారించారు. లహరి పొత్తి కడుపులో బలంగా తన్నటం వల్ల శరీరం అంతర్భాగంలో దాదాపు రెండున్నర లీటర్ల రక్తస్రావమై గడ్డ కట్టినట్టు తేల్చారు. దానికితోడు ఆమె తలను గోడ, తలుపులకు కొట్టటంతో తలపై కూడా గాయాలయ్యాయని నిర్ధారించారు. లహరి గుండెపోటుతో చనిపొలేదని, ఆమెను విచక్షణారహితంగా కొట్టటం వల్లనే మరణించిందని పోస్టుమార్టం నివేదిక ఇచ్చారు.
నివేదిక ఆధారంగా..
ఈ నివేదిక ఆధారంగా నారాయణగూడ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ కేసులోని సెక్షన్లను మార్చారు. ఐపీసీ 302 (హత్య), 201 (సాక్ష్యాధారాలను రూపుమాపటం)ల ప్రకారం సెక్షన్లను ఆల్టర్ చేశారు. అనంతరం వల్లబ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంట్లో తాను ఉద్దేశ్యపూర్వకగానే లహరిని కొట్టానని వల్లబ్ రెడ్డిన అంగీకరించినట్టు ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు. కొట్టటం వల్ల లహరికి తీవ్రంగా గాయాలు కావటంతో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు కూడా వల్లబ్ రెడ్డి ఒప్పుకొన్నట్టు తెలియజేశారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేసినట్లుగా వివరించారు.
తీవ్ర కలకలం..
వల్లబ్ రెడ్డి అరెస్టు ప్రధానంగా నల్గొండ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. అతని తండ్రి, కాంగ్రెస్ నాయకుడు అయిన రంగసాయి రెడ్డి తన కుమారుడు అమాయకుడని వ్యాఖ్యానించారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తాడని పేర్కొన్నారు. కానీ, లహరి తండ్రి జైపాల్‌రెడ్డి, అతని భార్య మాత్రం తమ అల్లుడు దేవునిలాంటి వాడని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఇప్పటికీ ప్రయత్నాలు..
కాగా వల్లబ్ రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అతని డైరెక్షన్లోనే లహరి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఎమ్మెల్యే లహరి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం జరిగినపుడు ఓ సీనియర్పోలీసు అధికారితోపాటు మూడు గంటలపాటు మార్చురీ వద్దనే ఉండటం గమనార్హం. కాగా.. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో మాట్లాడగా లహరిది హత్యేనన్న పోస్టుమార్టం నివేదిక మేరకే కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు.